హైదరాబాద్ : ఐసిఎల్ ఫిన్‌కార్ప్ భారీ విస్తరణ లక్ష్యాలను నిర్దేశించుకుంది. వచ్చే 2030 నాటికి శాఖల సంఖ్యను 600కు, రుణ పోర్ట్‌ఫోలియోను రూ.4,000 కోట్లకు పెంచాలని భావించినట్లు పేర్కొంది. 2029 నాటికి లోన్ బుక్‌ను రూ.2,600 కోట్లకు చేర్చాలని ప్రణాళిక వేసింది. ప్రమోటర్ల పెట్టుబడులు, బ్యాంకు రుణాలు, ఎన్‌సిడిల ద్వారా నిధుల సమీకరణతో విస్తరణ చేపట్టనుంది. తొలి అర్ధవార్షికంలో రూ.12.87 కోట్ల లాభాన్ని సంస్థ వెల్లడించింది. విస్తరణకు ప్రమోటర్ల నుంచి రూ.60 కోట్ల పెట్టుబడి, ఎస్‌బిఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి రూ.125 కోట్లు, రూ.500 కోట్ల ఎన్‌సిడిల సమీకరణకు ప్రణాళికలు రూపొందించుకుంది.
ఐసిఎల్ ఫిన్‌కార్ప్ భారీ విస్తరణ లక్ష్యం
23 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026, 09:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)