శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిస్నీ నూతన సిటిఒగా కరణ్‌దీప్‌ ఆనంద్

1 గంట క్రితం

discney
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 10:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజం డిస్నీ తన చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సిటిఒ)గా భారతీయ సంతతికి చెందిన కరణ్‌దీప్‌ ఆనంద్‌ను నియమించింది. క్యారక్టర్.ఎఐ సంస్థ సిఇఒగా సేవలందించిన ఆయన అక్టోబర్‌ 2 నుంచి నూతన బాధ్యతలు స్వీకరించనున్నారు. సిటిఒ హోదాతో పాటు కొత్తగా సృష్టించిన సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మౌలిక సదుపాయాలు, వినియోగదారుల సాంకేతికత, కృత్రిమ మేధ (ఎఐ) రంగాల్లో విశేష అనుభవం ఉన్న కరణ్‌దీప్‌.. అంతకుముందు మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, బ్రెక్స్‌ తదితర ప్రముఖ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఈయన బ్యాచిలర్‌ డిగ్రీని మన దేశంలోని ఐఐఐటి హైదరాబాద్‌లో పూర్తి చేయడం విశేషం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్