శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హైదరాబాద్‌‌లో ‘సెమీకాన్ తెలంగాణ’ ప్రతిపాదన

1 గంట క్రితం

bunes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 10:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సెమీ ఇండియా అధ్యక్షుడితో సందీప్ మక్తలా

న్యూఢిల్లీ: భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న సెమీకండక్టర్ పరిశ్రమలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని టిచిప్‌ చైర్మన్, వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ చైర్మన్ సందీప్ మక్తలా అన్నారు. ‌సెమికాన్‌ ఇండియా 2026 సదస్సు సందర్భంగా సెమీ ఇండియా అధ్యక్షుడు అశోక్ చందక్‌ను సత్కరించిన ఆయన, తెలుగు రాష్ట్రాలను ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమతో అనుసంధానించే దిశగా ‘సెమీకాన్ తెలంగాణ’ నిర్వహణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం సెమీకాన్ 2.0 కింద భారీగా నిధులు కేటాయిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో చిప్ రూపకల్పన, మేధో సంపత్తి, ఏఐ చిప్స్, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో తయారీ, ప్యాకేజింగ్ రంగాలను అనుసంధానించి సమగ్ర వ్యవస్థను నిర్మించవచ్చని తెలిపారు. 2030 నాటికి 10 వేల మంది ఇంజినీర్లను ఈ రంగానికి సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్