బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

LayOffs - కార్పొరేట్‌ కొరడా.. పెప్సీకో, క్వాల్‌కామ్‌లో ఉద్యోగాల కోత !

6 గంటల క్రితం

Layoffs The corporate whip cracks Job cuts at PepsiCo and Qualcomm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 12:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పెప్సీకోలో 1,000 మందికి ఉద్వాసన.. లేఆఫ్‌ల బాటలో క్వాల్‌కామ్‌


బిజినెస్ : వ్యాపార కార్యకలాపాలు విస్తరిస్తున్నప్పటికీ, ప్రముఖ బహుళజాతి సంస్థలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా శీతలపానీయాల తయారీ దిగ్గజం పెప్సీకో (PepsiCo) ఉత్తర అమెరికాలో తన వ్యాపార కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించేందుకు సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. వ్యాపార సామర్థ్యాన్ని మెరుగుపరచడం, కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని సంస్థ వెల్లడించింది.

pepsico


విచిత్రమేమిటంటే.. ఇదే సమయంలో పెప్సీకో ఐరోపా, మధ్య ఆఫ్రికా వ్యాపారం ఈ త్రైమాసికంలో 5.41 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయినప్పటికీ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. 2025లో ఇలియాట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ పెప్సీకోలో వాటాలు కొనుగోలు చేసిన అనంతరం కంపెనీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది.


క్వాల్‌కామ్‌లోనూ ఉద్యోగాల కోత ...

మరోవైపు ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్‌ (Qualcomm) కూడా ప్రకటించిన ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది. అక్టోబర్‌లోనే లేఆఫ్‌ల గురించి వెల్లడించిన సంస్థ తాజాగా ప్రభావితమయ్యే ఉద్యోగుల కోసం స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసే వారికి పరిహార ప్యాకేజీని ప్రకటించింది.

qualcomm


ఈ ప్యాకేజీకి అంగీకరించి, ఎగ్జిట్ పత్రాలపై సంతకాలు చేసే ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు కల్పించనున్నట్లు తెలిపింది. ఇందులో రెండు వారాల స్థూల వేతనంతోపాటు, సంస్థలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి రెండు వారాల అదనపు వేతనం, మిగిలిన సర్వీసుకు సంబంధించిన ముందస్తు పరిహారం, ఆరోగ్య బీమా కవరేజీకి ఏకమొత్తం చెల్లింపు వంటి ప్రయోజనాలు ఉన్నాయి.


అయితే ఈ విడతలో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమవుతారనే విషయాన్ని సంస్థ స్పష్టంగా వెల్లడించలేదు. తొలుత భారత్‌లో సుమారు 1,000 ఉద్యోగాలపై ప్రభావం ఉండొచ్చని అంచనా వేసినప్పటికీ, ప్రస్తుతం ఆ సంఖ్య తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్వాల్‌కామ్‌లో సుమారు 52 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్