ముంబయి : రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్‌ఓ) అమిత్ బాప్నాను సిబిఐ అరెస్టు చేసింది. రిలయన్స్ ఎడిఎ గ్రూప్ కేసులకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా అమిత్ బాప్నాను అరెస్టు చేసినట్లు సిబిఐ అధికారులు శనివారం తెలిపారు. 2014 ఆగస్టు నుండి 2019 డిసెంబరు వరకు రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ సిఎఫ్‌ఓగా పనిచేశారు. ఈ సమయంలో ‘ఆర్‌బిఐ మార్గదర్శకాలకు, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి రుణాలు తీసుకునేందుకు సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా మధ్యవర్తిత్వ, అనుసంధాన కంపెనీలకు రుణాలు మంజూరు చేయడం, ఆమోదం తెలపడం చేశారు’ అని సిబిఐ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, వివిధ బ్యాంకుల నుంచి రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ తీసుకున్న నిధులను అటువంటి మధ్యవర్తిత్వ సంస్థల ద్వారా రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్ వంటి వివిధ రిలయన్స్ ఎడిఎ గ్రూప్ కంపెనీలకు మళ్లించినట్లు తమ దర్యాప్తులో తేలిందని సిబిఐ తెలిపింది. దీనివల్ల రుణాలు ఇచ్చిన బ్యాంకులకు నష్టం వాటిల్లడమే కాకుండా, నిందితులు- సంబంధిత సంస్థలకు అక్రమ లబ్ధి చేకూరిందని సిబిఐ ఆరోపించింది. అయితే బాప్నా ఇప్పటికే ఇడి కేసులో అరెస్టుయి, తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రస్తుత కేసులో అరెస్టు చేసేందుకు ముంబయిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జీ నుంచి అనుమతి తీసుకున్నట్లు ఈ ప్రకటనలో తెలిపింది. బాప్నాను నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి పంపుతూ ప్రత్యేక కోర్టు ఆదేశించిందని కూడా సిబిఐ తెలిపింది.
రిలయన్స్ క్యాపిటల్ మాజీ సిఎఫ్‌ఓ అరెస్టు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 04, 2026, 11:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)