శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రిలయన్స్‌ లాభాల్లో 22 శాతం తగ్గుదల

1 గంట క్రితం

relaince
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 11:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఆదాయంలో 25 శాతం వృద్ధి

ముంబయి : ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 జూన్‌‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో మిశ్రమ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సంస్థ నికర లాభం గతేడాదితో పోలిస్తే 22.3 శాతం తగ్గి రూ.20,946 కోట్లకు చేరగా, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం మాత్రం 25.4 శాతం పెరిగి రూ.3.12 లక్షల కోట్లకు చేరింది. ఇతర ఆదాయం తగ్గడం, గత ఏడాది లభించిన పెట్టుబడుల విక్రయ లాభాలు ఈసారి లేకపోవడం నికర లాభంపై ప్రభావం చూపాయి. విభాగాల వారీగా పరిశీలిస్తే ఆయిల్-టు-కెమికల్స్ (ఒ2సి) వ్యాపార ఆదాయం 30.4 శాతం పెరిగి రూ.2.02 లక్షల కోట్లకు చేరగా, డిజిటల్ సర్వీసెస్ ఆదాయం 11.8 శాతం వృద్ధితో రూ.46,900 కోట్లుగా నమోదైంది. రిటైల్ విభాగం ఆదాయం 7.4 శాతం పెరిగి రూ.90,409 కోట్లకు చేరింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్