ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికాలో ఎస్‌బిఐ విస్తరణ

1 రోజు క్రితం

అమెరికాలో ఎస్‌బిఐ విస్తరణ
 టెక్సాస్‌లో కొత్త బ్రాంచ్ ప్రారంభం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 07:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- టెక్సాస్‌లో కొత్త బ్రాంచ్ ప్రారంభం

ముంబయి : బ్యాంకింగ్‌ ‌దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌‌బిఐ) అమెరికాలో తన బ్యాంకింగ్ కార్యకలాపాలను మరింత విస్తరించింది. ఉత్తర డల్లాస్‌లోని ఫ్రిస్కో, టెక్సాస్‌లో సబ్సిడరీ బ్యాంక్ (ఎస్‌‌బిఐసి) నూతన శాఖను ఎస్‌బిఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి లాంచనంగా ప్రారంభించారు. ఈ బ్రాంచ్‌తో కాలిఫోర్నియా వెలుపల తొలిసారిగా ఎస్‌బిఐ అడుగుపెట్టినట్లయింది. దీనితో యుఎస్‌లో ఎస్‌బిఐ సబ్సిడరీ శాఖల సంఖ్య 8కి చేరింది. వీటికి తోడు న్యూయార్క్, షికాగో, లాస్ ఏంజెల్స్‌లలో ఉన్న 3 ప్రత్యక్ష శాఖలు, వాషింగ్టన్ విభాగాలున్నాయి. అంతర్జాతీయంగా 29 దేశాల్లో ఎస్‌బిఐ నెట్‌వర్క్ పాయింట్ల సంఖ్య 245కు పెరిగింది. వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న డల్లాస్‌లోని ఎన్‌ఆర్‌ఐలు, స్థానిక వ్యాపారులకు డిపాజిట్లు, రెమిటెన్సులు, కమర్షియల్ రుణాలు తదితర సేవలను అందించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశామని సిఎస్‌ శెట్టి ‌తెలిపారు. ‘టెక్సాస్ బ్రాంచ్ ప్రారంభం ఎస్‌బిఐ అంతర్జాతీయ విస్తరణలో కీలక మైలురాయి. కాలిఫోర్నియా దాటి కార్యకలాపాలు పెంచడం ద్వారా భారత్-అమెరికాల మధ్య ఆర్థిక, రవాణా సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాం.’ అని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్