- హైదరాబాద్‌లో గ్లోబల్ రైజ్ సదస్సులో వక్తలు
హైదరాబాద్ : నగరంలోని ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల బలాన్ని వినియోగించుకుని ఎంఎస్‌ఎంఇలకు అంతర్జాతీయ మార్కెట్లు, పెద్ద సరఫరా గొలుసుల్లో అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఎస్‌ఎంబి కనెక్ట్ వ్యవస్థాపకుడు సందీప్ రాయ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ‘గ్లోబల్ రైజ్ 2026’ వ్యాపార సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఎస్‌ఎంబి కనెక్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 15 నగరాల దేశీయ పర్యటనలో భాగంగా హైదరాబాద్ ఆరో వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో గ్లోబల్ రైజ్ అవార్డ్స్ 2026ను కూడా అందజేశారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, ఎఐ, పారిశ్రామిక వృద్ధి అవకాశాలపై దాదాపు 130 మంది నిపుణులు ఈ సదస్సులో చర్చలు జరిపారు. చిన్న వ్యాపారాలు కూడా అంతర్జాతీయ మార్కెట్లలో పెద్ద సరఫరా గొలుసుల ప్రయోజనాలను పొందాలనేదే గ్లోబల్ రైజ్ ప్రధాన ఉద్దేశమని సందీప్ రాయ్ పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)