శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్‌వి వెక్టర్ ఐపిఒ ప్రారంభం

6 గంటల క్రితం

ఎస్‌వి వెక్టర్ ఐపిఒ ప్రారంభం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 08:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : ఈ-కామర్స్ ఎకోసిస్టమ్ సంస్థ ఎస్‌‌వి వెక్టర్ లిమిటెడ్ రూ.420 కోట్ల ప్రాథమిక పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)శుక్రవారం ప్రారంభమైంది. సెప్టెంబర్ 29 వరకు అందుబాటులో ఉండే ఈ ఇష్యూ ధరల శ్రేణిని రూ.30 - రూ.32గా నిర్ణయించగా.. ఇష్యూ ప్రారంభానికి ముందే యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా కంపెనీ రూ.189 కోట్లను సమీకరించింది. ఇందులో భాగంగా ఒక్కో షేరు రూ.32 చొప్పున 5.90 కోట్ల ఈక్విటీ షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. ఈ ఐపిఒలో భాగంగా రూ.287 కోట్ల విలువైన 8.97 కోట్ల కొత్త షేర్లతో పాటు, వాటాదారుల ద్వారా రూ.133 కోట్ల విలువైన 4.16 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్‌) ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 468 షేర్లకు రూ.14,976 చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్