శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టాటా మోటార్స్‌‌కు తగ్గిన నష్టాలు..

8 గంటల క్రితం

టాటా మోటార్స్‌‌కు తగ్గిన నష్టాలు.. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 09:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : ​టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ (టిఎంపివి) ఆదాయాలు పెరిగినప్పటికీ నష్టాలను చవి చూసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 సెప్టెంబర్‌‌తో ముగిసిన రెండో త్రైమాసికం(క్యూ2)లో రూ.5,451 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,368 కోట్ల నష్టంతో పోలిస్తే ఇది తగ్గింది. జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జెఎల్‌ఆర్‌) విక్రయాలు పుంజుకోవడం, దేశీయ ప్యాసింజర్‌ వాహనాల వ్యాపారంలో వృద్ధి నేపథ్యంలో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 34 శాతం పెరిగి రూ.96,920 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.72,349 కోట్లుగా ఉంది. ఉద్యోగుల తొలగింపులు, ఆస్తుల విలువ తగ్గింపు రూపంలో రూ.6,738 కోట్ల అసాధారణ వ్యయాలు నమోదయ్యాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్