ప్రజాశక్తి - తెనాలి
రెండున్నర సంవత్సరాల కాలంలో కూటమి చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను బట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఓటర్లను కోరారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని 30, 31, 32, 33వ వార్డుల్లో శుక్రవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. చైర్మన్ అభ్యర్థి తోటకూర వెంకట రమణారావు, వార్డు కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి నిర్వహించిన ప్రచారంలో స్థానికులు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను కూడా విన్నారు. స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటే కూటమి అభ్యర్థులని గెలిపించాలని కోరారు. స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీ నుంచి ప్రారంభమైన ప్రచారంలో కౌన్సిలర్ అభ్యర్థులు మంగమూరి లావణ్య, మైలా సుధీర్ బాబు, పినపాటి అనూష, మైలా హరికృష్ణ, పలువురు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.







కామెంట్లు (0)