ప్రజాశక్తి - హైదరాబాద్ : మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఎంఈఐఎల్, సుధా రెడ్డి ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘పింక్ పవర్ రన్’ మూడో ఎడిషన్‌కు హైదరాబాద్ సిద్ధమైంది. నెక్లెస్‌రోడ్డులోని హెచ్‌ఎండిఎ గ్రౌండ్స్ వేదికగా ఆదివారం ఉదయం 5 గంటల నుంచి ప్రారంభం కానున్న ఈ పరుగులో పాల్గొనేందుకు ఇప్పటికే 35 వేల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. 3, 5, 10, 21 కిలోమీటర్లుగా నాలుగు విభాగాల్లో సాగనున్న ఈ రన్‌లో విజేతలకు మొత్తం రూ.75 లక్షల నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, డిజిపి సీవీ ఆనంద్, అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌తో పాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. థమన్ ప్రత్యక్ష సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలిపారు.
నేడు ‘పింక్ పవర్ రన్ 3.0’..
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 09:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)