శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పౌల్ట్రీ ఎగ్జిబిషన్‌కు 60 వేల మంది సందర్శకులు

2 గంటల క్రితం

పౌల్ట్రీ ఎగ్జిబిషన్‌కు 60 వేల మంది సందర్శకులు
- ప్రదర్శనకు విశేష స్పందన
- ఉదయ్ సింగ్ బయాస్ వెల్లడి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 09:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రదర్శనకు విశేష స్పందన

- ఉదయ్ సింగ్ బయాస్ వెల్లడి

ప్రజాశక్తి - హైదరాబాద్‌ : నగరంలోని హైటెక్స్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన 18వ పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు సుమారు 60 వేల మంది సందర్శకులు హాజరైనట్లు పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి పౌల్ట్రీ రైతులు, పరిశ్రమ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో ఈ ప్రదర్శనను సందర్శించారని పేర్కొన్నారు. పౌల్ట్రీ రంగంలో ఆధునిక సాంకేతికతలు, నూతన ఆవిష్కరణలు, అధునాతన పరికరాలు, పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన పరిష్కారాలను ప్రదర్శించేందుకు ఈ ఎగ్జిబిషన్‌ వేదికగా నిలిచిందన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ పరిశ్రమకు భరోసానిచ్చిందని బయాస్‌ తెలిపారు. రాష్ట్రంలో పౌల్ట్రీ రంగాన్ని మరింత బలోపేతం చేసి తెలంగాణను దేశంలోనే పౌల్ట్రీ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ప్రదర్శన విజయవంతానికి సహకరించిన నిర్వాహకులు, సంస్థలు, ఎగ్జిబిటర్లు, రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్