ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎన్‌‌టిపిసికి బంఫర్‌ లాభాలు...

16 గంటల క్రితం

ఎన్‌‌టిపిసికి బంఫర్‌ లాభాలు
క్యూ2లో రూ.7,351 కోట్లుగా నమోదు
ఆదాయం 21 శాతం పెరుగుదల
ఒక్కో షేరుకు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026, 11:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • క్యూ2లో రూ.7,351 కోట్లుగా నమోదు

  • ఆదాయం 21 శాతం పెరుగుదల

  • ఒక్కో షేరుకు రూ.3 మధ్యంతర డివిడెండ్‌

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ విద్యుత్‌ ఉత్పత్తి దిగ్గజం ఎన్‌టిపిసి భారీ లాభాలను సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 సెప్టెంబర్‌‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో కంపెనీ ఏకీకృత నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 40.7 శాతం పెరిగి రూ.7,351 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.5,225 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 21.2 శాతం వృద్ధితో రూ.44,784 కోట్ల నుంచి రూ.54,270 కోట్లకు పెరిగింది. అనుబంధ సంస్థల లాభాలు భారీగా పెరగడం కంపెనీ మొత్తం లాభదాయకతకు ప్రధానంగా దోహదపడిందని ఎన్‌‌టిపిసి వెల్లడించింది. గడిచిన క్యూ2లో ఎన్‌‌టిపిసి అనుబంధ సంస్థల లాభాలు 73 శాతం పెరిగి రూ.1,149 కోట్ల నుంచి రూ.1,990 కోట్లకు చేరాయి. అయితే ఆదాయంతో పాటు కంపెనీ వ్యయాలు కూడా పెరిగాయి. మొత్తం వ్యయాలు రూ.40,218 కోట్ల నుంచి రూ.48,059 కోట్లకు చేరాయి. ​ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో కంపెనీ ఏకీకృత నికర లాభం 25.7 శాతం పెరిగి రూ.14,247 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.11,334 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. దేశంలోని ఇతర బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాల్లో సగటు ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ 68.35 శాతంగా ఉండగా, ఎన్‌టిపిసి కేంద్రాల్లో 75.11 శాతంగా నమోదైంది. మరోవైపు వాటాదారులకు 2026-27కు సంబంధించి తొలి మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.3 చొప్పున డివిడెండ్‌ చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. డివిడెండ్‌కు అర్హులైన వాటాదారులను నిర్ణయించేందుకు నవంబర్‌ 6ను రికార్డు తేదీగా ఖరారు చేసింది. నవంబర్‌ 25 నుంచి డివిడెండ్‌ చెల్లింపులు ప్రారంభించనున్నట్లు ఎన్‌‌టిపిసి వెల్లడించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్