ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన : జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు పి.ప్రశాంతి

2 గంటల క్రితం

0
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 03:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి అమలాపురం అమలాపురం మున్సిపాలిటీ,ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు పి.ప్రశాంతి,ఐఏఎస్ తెలిపారు.సమస్యాత్మక,సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సీసీటీవీ పర్యవేక్షణ,వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం ఆమె అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోని 31, 32వ వార్డుల పోలింగ్ కేంద్రాలను,మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.పోలింగ్ నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు,భద్రతా చర్యలు,సిబ్బంది విధులు,మౌలిక సదుపాయాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని 14, 15వ నంబరు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ నిర్వహణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.ఈ పర్యటనలో ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ రవివర్మ,ఎన్నికల సిబ్బంది,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్