ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయ పర్యాటకులు

1 గంట క్రితం

nepal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 03:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఖాట్మాండు : నేపాల్‌లో భారీ హిమపాతం కారణంగా ఆరుగురు భారతీయులు చిక్కుకుపోయారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. పర్యాటకులు శనివారం నేపాల్‌లోని ధో ప్రాంతంలోని షేఫోక్సుండో సరస్సుకు వెళ్లారు. అదే సమయంలో భారీ హిమపాతం కురిసిందని డోల్పా డిస్ట్రిక్ట్ చీఫ్‌ ఆఫీసర్‌ జును ధకల్‌ పేర్కొన్నారు. షే ఫోక్సుండో సరస్సు నేపాల్‌లోనే అత్యంత లోతైన సరస్సు అని, ఇది 3,600మీటర్ల ఎత్తులో ఉందని, 145 మీటర్ల లోతు కలిగి ఉందని అన్నారు. సరస్సు సహా ఆ ప్రాంతమంతా భారీ మంచుతో కప్పబడి ఉందని, భద్రతా సిబ్బంది, గైడ్‌ హెచ్చరించినప్పటికీ వినిపించుకోలేదని, గైడ్‌ను వదిలేసి, భారీ హిమపాతం కురుస్తున్నప్పటికీ పర్యాటకులు సరస్సు ప్రాంతం వైపు వెళ్లారని ధకల్‌ తెలిపారు. శనివారం రాత్రి వారిని సంప్రదించే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. వారు చిక్కుకుపోఇయన ప్రాంతాన్ని తాము గుర్తించామని, ఆర్మీ హెలికాప్టర్‌ సాయంతో వారిని రక్ష‍ించేందుకు యత్నిస్తున్నామని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్