ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలవరం నిర్వాసితుల పక్షాన నిరంతరం పోరాడతాం:సిపిఎం జోరుగా ప్రచారం

1 గంట క్రితం

11
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 03:38 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​బాధితులకు కాంటూరు లెక్కల్లేకుండా పరిహారం, ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్

ప్రజాశక్తి_వి.ఆర్.పురం: పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిపిఎం పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా వి.ఆర్.పురం మండలంలో సిపిఎం అభ్యర్థులు, నాయకులు వాగులు,వంకలు దాటుతూ,పడవలపై ప్రయాణిస్తూ నిర్వాసిత గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజా మద్దతు కూడగడుతున్నారు. ​వలస ఆదివాసీ గ్రామమైన నాగేంద్రపురంలో సిపిఎం ఎంపీటీసీ అభ్యర్థి సున్నం రాజులు(మాస్టర్)పార్టీ క్యాడర్,నాయకులతో కలిసి వాగులు,వంకలను దాటుకుంటూ గ్రామ ప్రజలను కలిశారు. 2

తమ సమస్యలు తీరాలంటే చట్టసభలు,ప్రజా వేదికలపై పోరాడే విద్యావంతుడైన అభ్యర్థి రాజులు మాస్టార్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులు కోరారు. ​ఈ సందర్భంగా రాజులు మాస్టర్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న చిన్న మట్టపల్లి,గుర్రంపేట,చింతరేగుపల్లి,పెద్దమట్టపల్లి గ్రామాలకు,భూములకు తక్షణమే నష్టపరిహారం ప్యాకేజీ మంజూరు చేయాలన్నారు. ప్రాజెక్టు ముంపునకు సంబంధించి కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా నిర్వాసిత గ్రామాలు,భూములు అన్నింటికీ పరిహారం అందించాలన్నారు. రాజమండ్రి,పాడేరు ప్రయాణాలకు వీలుగా ప్రత్యేక రోడ్లు నిర్మించాలి.ముఖ్యంగా పెద్దమట్టపల్లి నుండి నర్సింగ్ పేట వరకు,రేఖపల్లి నుండి చింతూరు వరకు రహదారుల నిర్మాణానికి తక్షణమే నిధులు కేటాయించి,నిరంతర బస్సు సౌకర్యాన్ని కల్పించాలన్నారు. వలసి ఆదివాసి గ్రామాలకు విద్యుత్తి మంచినీరు రహదారులు కల్పిస్తామని అధిక మెజార్టీతో సుత్తి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

00

​​మండలంలోని జీడిగుప్ప సిపిఎం వైసీపీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి కోణాల శేషమ్మ ప్రచారంలో భాగంగా సిపిఎం మండల నాయకులు వైసిపి వినూత్న రీతిలో గోదావరి తీరంలో పడవలపై ప్రయాణిస్తూ పోలవరం నిర్వాసిత గ్రామాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. జీడిగుప్ప నుంచి వరకు పడవలపై వెళ్లిన నాయకులు,ప్రాజెక్టు కారణంగా పునరావాస కాలనీల్లో నివసిస్తున్న ఏలూరు జిల్లా నిమ్మలగూడెం పోచవరం గ్రామం ప్రజలను నేరుగా కలిసి పునరవాస కాలనీ వారి క్షేమ సమాచారాలు,ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.ప్రజాసమస్యలపై పోరాడే ప్రజాపక్షం సిపిఎంను గెలిపించాలని,అభ్యర్థుల సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీ అందించాలని గ్రామస్తులను అభ్యర్థించారు..సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పంకు సత్తిబాబు,కొండారెడ్డి,తుర్రం బాబురావు,సత్యనారాయణ,లక్ష్మణ్,పద్మారావు,సిహెచ్ సుబ్బారావు,తోపాటు,వైసీపీ నాయకుల,గోపాల్,పండ రామకృష్ణ,జీడి గుప్ప మాజీ సర్పంచ్,బాలరాజు,తదితరులు పాల్గొన్నారు



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్