వారంలో 1.2 బిలియన్ డాలర్ల క్షీణత
న్యూఢిల్లీ : భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు (ఫారెక్స్) వరుసగా తగ్గిపోతున్నాయి. అక్టోబర్ 24తో ముగిసిన వారంలో నిల్వలు 1.2 బిలియన్ డాలర్లు తగ్గి 719.74 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంతకుముందు వారంలోనూ 5 బిలియన్ డాలర్లు తగ్గి 721.02 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 4న 785.706 బిలియన్ డాలర్ల చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరిన నిల్వలు, ఆ తర్వాత క్రమంగా తగ్గుతున్నాయి. రూపాయి మారక విలువలో ఒడిదుడుకులను నియంత్రించేందుకు ఆర్‌బిఐ డాలర్లను విక్రయించడం ఈ క్షీణతకు ఒక కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సిఎ) 1.3 బిలియన్ డాలర్లు పెరిగి 593.20 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వలు 2.6 బిలియన్ డాలర్లు తగ్గి 103.15 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) వద్ద భారత్ రిజర్వులు 4.787 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.








కామెంట్‌లు (0)