ఇడ్లీల బామ్మంటే
ఎవరికైనా తెలుసు!
అసలు పేరు చెబితే
ఆమె గుర్తుకు రాదు!!
ధరలెంత పెరిగినా
తనుమాత్ర మెప్పుడూ
ఇడ్లి రూపాయికే
ఇస్తుంది అందరికి!!
తనకు తొంంభై ఏళ్లు
తనె స్వయముగా వెళ్లి
సరుకులను తెస్తుంది
సరకుచేయదు శ్రమను!!
రోట్ల వేసీ పప్పు
రుబ్బుతుందీ తానె!
వందలా ఇడ్లీలు
అందించు ప్రతిరోజు!!
ఓపికున్నది ఇంక
ఆపబోనీ పనిని!
అదె నాకు సంతృప్తి
అనును ఇడ్లీ బామ్మ!
ఆమె పద్ధతినచ్చి
ఆనంద్ మహీంద్ర తన
కానుకగ ఇల్లొకటి
కట్టించె బామ్మకై!
గ్యాసు పొయ్యికి తానె
కనక్షన్ ఇప్పించె!
ఆ గ్యాసుకగు ఖర్చు
ఆతడే భరియించె!
ఎంత పేరొచ్చినా
సుంత గర్వము లేదు
ప్రేమగా అందరీ
క్షేమమడుగును బామ్మ’’
‘‘బాలబంధు’’ అలపర్తి వెంకటసుబ్బారావు
(కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య
పురస్కార గ్రహీత)
94440805001







కామెంట్‌లు (0)