శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

US Markets - అమెరికా మార్కెట్లలో భారీ పతనం .. ఒక్కరోజే కుప్పకూలిన సూచీలు

2 గంటల క్రితం

Major slump in US markets indices collapse in a single day
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 01:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమెరికా : అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత భారీగా లాభపడిన వాల్‌స్ట్రీట్ మార్కెట్లు మరుసటి రోజే తీవ్ర నష్టాలను చవిచూశాయి. మదుపర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడంతో 19 నెలల్లో ఎన్నడూ లేనంతగా ప్రధాన సూచీలు పడిపోయాయి. నాస్‌డాక్ 5.52 శాతం, ఎస్‌అండ్‌పీ 4.36 శాతం, డోజోన్స్ 3.4 శాతం చొప్పున నష్టపోయాయి.


టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఎఐ), సెమీకండక్టర్ రంగాల షేర్లలో భారీ అమ్మకాలు మార్కెట్ పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ఈ రంగాల్లో కంపెనీల షేర్ల విలువ వాస్తవ స్థాయికి మించి పెరిగిందన్న ఆందోళనతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. మరోవైపు ఎఐ డేటా సెంటర్ల విస్తరణపై డెమోక్రాట్లు ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న అంచనాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపాయి.


మస్క్ కంపెనీలకు భారీ దెబ్బ ....

ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా, స్పేస్‌ఎక్స్ కంపెనీల మార్కెట్ విలువ కేవలం రెండు రోజుల్లోనే 420 బిలియన్ డాలర్లకు పైగా తగ్గింది. ఎన్నికల్లో మస్క్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఓడిపోవడం, ఆయన కంపెనీలపై విచారణలు, నిబంధనలు కఠినతరం కావచ్చన్న భయాలు ఇందుకు కారణమయ్యాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు, ఎఐ ప్రాజెక్టులు, కంపెనీల విలీన ప్రయత్నాలపై ప్రతికూల ప్రభావం పడవచ్చని మదుపర్లు భావిస్తున్నారు. అమెరికా మార్కెట్ల పతనం ప్రభావం ఆసియా మార్కెట్లపైనా పడింది. జపాన్ నిక్కీ సూచీ 6 శాతానికి పైగా, దక్షిణ కొరియా కొస్పి 8 శాతం మేర నష్టపోయాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్