శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జెఎస్‌ఎస్‌సి-సిజిఎల్‌ పరీక్ష‍ను రద్దు నిర్ణయాన్ని కొట్టివేసిన జార్ఖండ్‌ హెచ్‌సి

1 గంట క్రితం

Jharkhand HC
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 02:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాంచీ : జెఎస్‌ఎస్‌సి-సిజిఎల్‌ పరీక్ష‍ను రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జార్ఖండ్‌ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. జెఎస్‌ఎస్‌సి-సిజిఎల్‌ పరీక్ష‍ల కింద నియామకాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్నయాన్ని జస్టిస్‌ దీపక్‌ రోషన్‌ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం పక్కన పెట్టింది. ప్రకటన 10/2023 కింద ఎంపికైన అభ్యర్థులను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. వారి సేవలను ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరాయమైనవిగా పరిగణించాలని పేర్కొంది. నియామక ప్రక్రియను రద్దు చేస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ కారణంగా, అభ్యర్థులకు లభించాల్సిన ఇతర సేవా ప్రయోజనాలేవీ వారికి అందకుండా పోకూడదని ఆదేశించింది.


అభ్యర్థుల ఆందోళనలు, సిఐడి ఇచ్చిన నివేదిక ఆధారంగా హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వం పరీక్ష‍ల ప్రక్రియను, అభ్యర్తుల నియామకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ ఏడాది ఆగస్టు 18 రాత్రి వేళ విడుదల చేసిన ఒక నోటిఫికేషన్‌లో ఈ నిర్ణయాన్ని వెల్లడించతింది. అదే రోజున, హేమంత్‌ సోరెన్‌ మంత్రివర్గం మొత్తం 22 పరీక్ష‍లను రద్దు చేయాలని నిర్ణయించింది. వీటిలో 11 నుండి 13వ జెపిఎస్‌సి (జెపిఎస్‌సి) పరీక్ష‍లు, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ (సిడిపిఒ) పరీక్ష‍, జెఎస్‌ఎస్‌సి-సిజిఎల్‌ పరీక్ష‍లు ఉన్నాయి. అలాగే ఆరు పరీక్ష‍లను వాయిదా వేసింది. ఈపరీక్ష‍ల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణను సిఐడికి అప్పగించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్