శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చైర్‌పర్సన్‌ రేసులో టిడిపి అభ్యర్థి హనీ స్పందన ఆధిక్యం

2 గంటల క్రితం

chirala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 03:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

2,542 ఓట్ల మెజారిటీతో ముందంజ

కౌన్సిలర్ స్థానాల్లోనూ కూటమి ఆధిక్యం

ప్రజాశక్తి - చీరాల : చీరాల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి హనీ స్పందన 2,542 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు 44 వార్డుల కౌన్సిలర్ స్థానాలకు సంబంధించి ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో టీడీపీ 12, బీజేపీ 1, వైసీపీ 5, కాంగ్రెస్ 7 స్థానాల్లో విజయం సాధించాయి. మిగిలిన వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్ పూర్తయిన తర్వాత తుది ఫలితాలు వెల్లడికానున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్