శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శ్రీ చైతన్య స్కూల్‌లో రక్తదాన శిబిరం

1 గంట క్రితం

east godavari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 03:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

50 మంది సిబ్బంది రక్తదానం...

ప్రజాశక్తి - మండపేట : శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్‌పర్సన్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని మండలంలోని తాపేశ్వరం శ్రీ చైతన్య స్కూల్‌లో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రాజమహేంద్రవరం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్యర్యంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో మండపేట రీజియన్ కు చెందిన 50 మంది చైతన్య స్కూల్ సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా విలువలను చాటారని పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ తెలిపారు. సమాజ సేవలో భాగంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం చైర్‌పర్సన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాలను నిర్వహిస్తారని రీజినల్ ఇన్‌చార్జ్ నరేష్ పేర్కొన్నారు. రక్తదానం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌లు, ఉపాధ్యాయులు , పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్