బిజినెస్ : పశ్చిమాసియాలో నెలకొన్న చమురు సంక్షోభం ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 10.20 గంటల సమయానికి సెన్సెక్స్ 629 పాయింట్లు కోల్పోయి 72,142 వద్ద, నిఫ్టీ 197 పాయింట్లు పడిపోయి 22,582 వద్ద ట్రేడవుతున్నాయి. పెరుగుతున్న అంతర్జాతీయ చమురు ధరలు మార్కెట్లపై ఒత్తిడి పెంచుతున్నాయి. అమెరికా ఈ యుద్ధంలో విజయం సాధిస్తుందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యల తర్వాత సూచీల పతనం మరింత వేగవంతమైంది.
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ....
చమురు ధరల పెరుగుదల : బ్రెంట్ క్రూడ్ ధర 1.5 శాతం పెరిగి బ్యారెల్‌కు 107 డాలర్లకు చేరింది. భారత్ భారీగా చమురును దిగుమతి చేసుకునే దేశం కావడంతో ఈ పెరుగుదల దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
ఎఫ్‌ఐఐల అమ్మకాలు : విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత మార్కెట్లలో విక్రయాలను పెంచారు. సెప్టెంబర్ 28న ఒక్కరోజే సుమారు రూ.5,300 కోట్ల పెట్టుబడులను మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు.
అమెరికా వడ్డీరేట్లపై ఆందోళన : అమెరికా ఫెడ్ మరోసారి వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందన్న అంచనాలతో ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ గణనీయంగా పెరిగాయి. ఇది ప్రపంచ మార్కెట్లతో పాటు భారత స్టాక్ మార్కెట్లపైనా ఒత్తిడిని పెంచుతోంది.
ఆసియా, అమెరికా మార్కెట్లలోనూ నష్టాలు : దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్ మార్కెట్ సూచీలు కూడా భారీగా నష్టపోయాయి. సోమవారం అమెరికా మార్కెట్లు సైతం పతనమయ్యాయి. చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, అమెరికా వడ్డీరేట్లపై ఆందోళనలు కలిసి దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.








కామెంట్‌లు (0)