శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Markets - చమురు సెగ.. రూ.4 లక్షల కోట్లకు గండి

1 గంట క్రితం

Markets – Oil price heat... Rs 4 lakh crore hit.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 11:29 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

బిజినెస్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరగడం, పశ్చిమాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు మరింత ముదరడం, ప్రపంచ వాణిజ్యంపై ఆందోళనలు పెరగడం వంటి కారణాలతో మదుపర్లు భారీగా షేర్ల విక్రయాలకు దిగారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు గణనీయంగా క్షీణించగా, మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపదలో దాదాపు రూ.4 లక్షల కోట్ల మేర కోత పడింది. ఉదయం 9.40 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 715 పాయింట్లు నష్టపోయి 75,675 వద్ద ట్రేడవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 198 పాయింట్లు తగ్గి 23,671 స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు బలపడి 96.58 వద్ద కొనసాగింది.


ఎలాంటి షేర్లు లాభాల్లో.. ఏవి నష్టాల్లో అంటే ....

నిఫ్టీ సూచీలో సిప్లా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఓఎన్‌జీసీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, కోల్ ఇండియా షేర్లు స్వల్ప లాభాలు నమోదు చేశాయి. మరోవైపు ఇన్ఫోసిస్, ఎటర్నల్, భారతీ ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, హిందాల్కో, ఇండిగో షేర్లు అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ట్రేడయ్యాయి.


మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాలు ....


ముడి చమురు ధరల జోరు....

అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ ముడి చమురు ధరలు పెరుగుదల కొనసాగించాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 100 డాలర్లను దాటగా, గత నెలరోజుల్లోనే దాదాపు 40 శాతం పెరిగింది. ఈ పరిణామం ద్రవ్యోల్బణం, దిగుమతి వ్యయాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన మార్కెట్లను కలవరపెడుతోంది.


పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ....

ఎర్ర సముద్రంలో నౌకలపై హూతీల దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించడం, మరోవైపు వరుసగా 13వ రోజూ ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు కొనసాగడం ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచింది. దీంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు.


అమెరికా టారిఫ్ నిర్ణయాలు ....

బలవంతపు శ్రమ (వెట్టి చాకిరీ) అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్‌తో పాటు 60 దేశాలపై 10 నుంచి 12.5 శాతం వరకు సుంకాలు విధించాలని అమెరికా నిర్ణయించింది. ఈ చర్య ప్రపంచ వాణిజ్య వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లపైనా ఒత్తిడిని పెంచింది. మొత్తంగా ముడి చమురు ధరల పెరుగుదల, పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా తాజా టారిఫ్ నిర్ణయాలు కలిసి దేశీయ స్టాక్ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఫలితంగా ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొని, భారీ స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్