శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Markets - స్టాక్‌ మార్కెట్లలో భారీ నష్టాలు

21 గంటల క్రితం

Massive losses in stock markets
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 10:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ఉదయం భారీ నష్టాల్లో కొనసాగాయి. ఉదయం 9.46 గంటలకు నిఫ్టీ 230 పాయింట్లు కోల్పోయి 23,247 వద్ద, సెన్సెక్స్‌ 654 పాయింట్లు పడిపోయి 74,248 వద్ద ట్రేడయ్యాయి. నిఫ్టీ-50 లో హిందాల్కో ఇండస్ట్రీస్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు అత్యధిక నష్టాలను చవిచూశాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు కూడా 1.42 శాతం, 1.40 శాతం చొప్పున క్షీణించాయి. సెక్టార్లలో నిఫ్టీ రియల్టీ భారీగా పతనం కాగా, నిఫ్టీ ఐటీ మాత్రమే లాభాల్లో కొనసాగింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపాయి. డాలర్‌ ఇండెక్స్‌ 99.06 వద్ద, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 107.63 డాలర్ల వద్ద ఉన్నాయి. అమెరికా 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.91 శాతానికి చేరింది. గత సెషన్‌లో ఎస్‌అండ్‌పీ 500 0.58 శాతం, నాస్‌డాక్‌ 0.65 శాతం నష్టపోయాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్