- షేర్ల ధరల శ్రేణీ రూ.1700-రూ.1785
ముంబయి : దేశంలోని ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) ఐపిఒ పరిమాణం రెడ్ హేరింగ్ ప్రాస్పెక్టస్ (ఆర్‌హెచ్‌పి) దశలో భారీగా తగ్గింది. ముసాయిదా ప్రాస్పెక్టస్‌లో పేర్కొన్న దానికంటే ఆఫర్ పరిమాణాన్ని తగ్గించుకోవాలని ఎస్‌బిఐ సహా పలువురు కీలక వాటాదారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఇ ఐపిఒ సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభం కానుండగా.. ఇందుకు సంబంధించిన షేర్ల ధరల శ్రేణిని రూ.1,700 నుంచి రూ.1,785 మధ్య నిర్ణయించారు. ఈ ఇష్యులో రూ.1 ముఖ విలువ కలిగిన మొత్తం 12,64,36,650 ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఈ మొత్తం ఐపిఒ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) పద్ధతిలోనే సాగనుంది. అంటే వాటాదారులు తమ వద్ద ఉన్న షేర్లను విక్రయిస్తున్నారు తప్పా ఎక్స్ఛేంజ్‌కు కొత్తగా ఎలాంటి నిధులు సమకూరవు. ముసాయిదా దశలో ఉన్న వాటాదారుల విక్రయ ప్రణాళికల్లో మార్పులు జరగడం వల్ల ఐపీఓ మొత్తం పరిమాణం తగ్గింది.








కామెంట్‌లు (0)