గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపిఎస్‌‌బిల వ్యాపారం రూ.300 లక్షల కోట్లు...

3 గంటల క్రితం

ఆరు నెలల్లో రూ.1.09 లక్షల కోట్ల లాభాలు..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 10:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆరు నెలల్లో రూ.1.09 లక్షల కోట్ల లాభాలు..

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంక్‌‌ (పిఎస్‌‌బి)లు అదిరిపోయే వ్యాపారాలను సాధిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 తొలి ఆరు నెలల్లో నికర లాభాలు రికార్డు స్థాయిలో 16.9 శాతం పెరిగి రూ.1,09,540 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం వ్యాపారం తొలిసారిగా రూ.300 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించి రూ.301.6 లక్షల కోట్లకు చేరింది. పిఎస్‌‌బిల మొత్తం నిర్వహణ లాభం 13.9 శాతం వృద్ధితో రూ.1.81 లక్షల కోట్లకు చేరుకుంది. డిపాజిట్లు 13.1 శాతం పెరిగి రూ.275 లక్షల కోట్ల స్థాయికి చేరాయి. సెప్టెంబర్‌ 30 నాటికి ఏడాది ప్రాతిపదికన బ్యాంకుల మొత్తం వ్యాపారం 15.5 శాతం వృద్ధి నమోదు చేసింది.

​ రుణాల పంపిణీలోనూ జోరు..

​అన్ని రంగాల్లో నెలకొన్న రుణ డిమాండ్‌కు అనుగుణంగా బ్యాంకులు రుణాల మంజూరును పెంచాయి. ఈ కాలంలో రిటైల్‌ రుణాలు 17 శాతం, వ్యవసాయ రుణాలు 19.5 శాతం వృద్ధి చెందాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఇ) ఇచ్చిన రుణాలు 20.4 శాతం పెరిగాయి. బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ) భారీగా తగ్గుముఖం పట్టాయి. స్థూల ఎన్‌పిఎ నిష్పత్తి 1.69 శాతానికి, నికర ఎన్‌పిఎ నిష్పత్తి 0.33 శాతానికి దిగివచ్చాయి. రుణాల మంజూరులో మెరుగైన అంచనా విధానాలు, సాంకేతికత వినియోగం, పర్యవేక్షణ వ్యవస్థలు బ్యాంకుల ఆర్థిక ఆరోగ్యం మెరుగుపడటానికి దోహదపడ్డాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. రెగ్యూలేటరీ సంస్థలు నిర్దేశించిన కనీస ప్రమాణాల కంటే బ్యాంకుల మూలధన నిల్వలు అధికంగా ఉన్నాయని పేర్కొంది. మూలధన సమీకరణ ద్వారా బ్యాంకులు భవిష్యత్తులో మరింత రుణ వృద్ధికి తోడ్పడటంతో పాటు ఆర్థిక వ్యవస్థలో తలెత్తే ఒడిదుడుకులను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని వెల్లడించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్