శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వడ్డీ రేట్లు బాదుడే..!

2 గంటల క్రితం

వడ్డీ రేట్లు బాదుడే..!
రెపో రేటు అర శాతం పెంపు
 నోమురా అంచనా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 09:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- రెపో రేటు అర శాతం పెంపు

- నోమురా అంచనా

ముంబయి : రుణ గ్రహీతలపై మరింత వడ్డీ భారం పెరగనుందని పలు కీలక సంస్థలు అంచనా వేస్తోన్నాయి. డిసెంబర్‌ 4‌న జరిగే ఆర్‌‌బిఐ ద్రవ్య విధాన సమీక్షలో రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్లు (0.5 శాతం) పెంచే అవకాశం ఉందని రేటింగ్‌ ఎజెన్సీ నోమురా అంచనా వేసింది. గతంలో 25 బేసిస్‌ పాయింట్ల పెంపును అంచనా వేసిన సంస్థ తాజాగా దాన్ని రెట్టింపు చేసింది. 50 బేసిస్‌ ‌పాయింట్ల పెంపునకు 60 శాతం అవకాశముందని, 0.25 శాతం పెంపునకు 40 శాతం అవకాశముందని పేర్కొంది. అర శాతం పెంపు జరిగితే రెపో రేటు 6 శాతానికి చేరుతుంది. మరోవైపు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బిఒబి) మాత్రం 25 బేసిస్‌ ‌పాయింట్ల పెంపు ఉండొచ్చని అంచనా వేసింది. నవంబరులో ఆహార ధరలు ఊహించిన దానికంటే వేగంగా పెరగడం, కీలకద్రవ్యోల్బణంలోనూ ఒత్తిళ్లు పెరగడంతో వడ్డీ రేట్ల పెంపు తప్పనిసరి కావొచ్చని నోమురా విశ్లేషించింది. నవంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.4 శాతానికి చేరవచ్చని, అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసిక సగటు 6.3 శాతంగా ఉండవచ్చని సంస్థ అంచనా వేస్తోంది. జులై-సెప్టెంబర్‌ త్రైమాసిక జిడిపి వృద్ధి 7.5 శాతానికి మించి ఉండవచ్చని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్‌బిఐ 2027 ఆర్థిక సంవత్సర వృద్ధి అంచనాను 7.5 శాతానికి, ద్రవ్యోల్బణ అంచనాను 5.3 శాతానికి సవరించే అవకాశం ఉందని పేర్కొంది. అయితే డిసెంబరులో అర శాతం వడ్డీ పెంపు తర్వాత రెపో రేటును 6 శాతం వద్ద నిలిపివేయవచ్చని నోమురా పేర్కొంది. డిసెంబరులో 25 బేసిస్‌ పాయింట్లు, ఫిబ్రవరిలో మరో పావు శాతం, పరిస్థితుల ఆధారంగా ఏప్రిల్‌లో కూడా పెంపు జరిగే అవకాశం ఉందని బిఒబి భావిస్తోంది. ఈ అంచనాల ప్రకారం రెపో రేటు 6.25 శాతానికి చేరవచ్చని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్