ముంబయి : ఎస్‌బిఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ షేర్లు స్టాక్ మార్కెట్లో 6 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. ఐపిఒకు 41.66 రెట్లు సబ్‌స్క్రిప్షన్ లభించినప్పటికీ.. లిస్టింగ్ లాభాలు మాత్రం పరిమితంగా నమోదయ్యాయి. మంగళవారం లిస్టింగ్ రోజున షేరు కేవలం 6 శాతం ప్రీమియంతో ఎన్‌ఎస్‌ఇలో రూ.613 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో రూ.625 వరకు చేరినా ఆ జోరును కొనసాగించలేకపోయింది. రూ.11,693 కోట్లతో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో నిర్వహించిన ఈ ఐపిఒకు మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. రూ.11,693 కోట్ల ఈ ఐపిఒ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో జరిగింది. మరోవైపు ఉద్యోగుల ఈసాప్‌ల విలువ భారీగా పెరగడంతో 13 మందికి పైగా ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు.
Print Editionఎస్‌బిఐ ఫండ్స్ 6 శాతం ప్రీమియంతో లిస్టింగ్
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 21, 2026, 09:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)