గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకెఆర్‌ఎంబి సమావేశం 17కు వాయిదా

1 గంట క్రితం

krmb
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 09:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో : హైదరాబాద్‌‌లోని జలసౌధలో గురువారం నిర్వహించాల్సిన కృష్ణా రివర్‌ ‌మేనేజ్‌‌మెంట్ బోర్డు (కెఆర్‌ఎంబి) త్రిసభ్య కమిటీ సమావేశం ఈ నెల 17కు వాయిదా పడింది. కృష్ణా నది నీటి వాటాలు, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నుంచి నీటి విడుదల, ఇతర అంశాలపై చర్చించి, ఒక నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఇందుకు సంబంధించి వాటాల పంపిణీపై నిర్దిష్టమైన ప్రతిపాదనలు సూచించాలని ఇప్పటికే తెలంగాణ, ఎపిలను బోర్డు కోరింది. కాగా ఎపి అంతర్గత ఒత్తిడి వల్ల సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలిసింది. ఈ మేరకు రెండు రాష్ర్టాల నీటి పారుదల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు బోర్డు మెంబర్‌ ‌సెక్రటరి సతీష్‌ ‌కాంబోజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్