గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కిమ్స్‌ నుంచి ఎన్టీఆర్‌ డిశ్చార్జ్‌

59 నిమిషాల క్రితం

ntr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 08:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రి నుంచి గురువారం డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు వైద్యులతో కలిసి ఎన్టీఆర్‌ దిగిన ఫొటోను కిమ్స్‌ సోషల్‌ మీడియాలో పంచుకుంది. కుడి భుజానికి ఎన్టీఆర్‌కు ఆర్థ్రోస్కోపిక్‌ షోల్డర్‌ సర్జరీ జరిగింది. డాక్టర్‌ ఆర్‌.ఏ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్‌ నితిన్‌ బెజ్జంకి నేతృత్వంలో శస్త్రచికిత్స నిర్వహించారు. పూర్తి స్థాయిలో కోలుకునే వరకు వైద్యుల పర్యవేక్షణలో ఇంటి వద్దే క్రమబద్ధమైన రీహాబిలిటేషన్‌ కొనసాగించనున్నట్లు కిమ్స్‌ తెలిపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్