మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసెన్సెక్స్‌ 217 పాయింట్లు ‌పతనం

5 గంటల క్రితం

sensex
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 10:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాలను చవి చూశాయి. మంగళవారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 242.65 పాయింట్లు లేదా 0.33 శాతం కోల్పోయి 72,529కు పరిమితమయ్యింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 50 సూచీ కూడా 64 పాయింట్లు 0.28 శాతం నష్టంతో 22,716 వద్ద ముగిసింది. దీంతో వరుసగా రెండో రోజూ మార్కెట్లు నష్టాలను చవి చూసినట్లయ్యింది. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 0.99 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీ 0.81 శాతం మేర నష్టపోయాయి. నిఫ్టీ-50 జాబితాలో టైటాన్ కంపెనీ, విప్రో ఇండియా, హెచ్‌సీఎల్‌టెక్ షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. రంగాల వారీగా పరిశీలిస్తే.. కన్స్యూమర్ డ్యూరబుల్స్, కెమికల్స్, రియాల్టీ, ఐటి రంగాలు అత్యధికంగా నష్టపోగా, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు మాత్రం సానుకూలగా నమోదయ్యాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్