గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో షేర్‌ మార్కెట్లు డీలా

14 జులై, 2026

Stock markets deal with West Asian tensions
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 10:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 300 పాయింట్లకుపైగా పడిపోయిన సెన్సెక్స్‌


ముంబయి : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయ స్టాక్‌ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు ముదరడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. దీంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.96.14కు బలహీనపడింది. మరోవైపు బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మంగళవారం దేశీయ సూచీలు నష్టాలతో ట్రేడవుతున్నాయి. గత ట్రేడింగ్‌ సెషన్‌లో 77,616 వద్ద ముగిసిన సెన్సెక్స్‌ మంగళవారం ప్రారంభంలోనే దాదాపు 400 పాయింట్లు కోల్పోయింది. అనంతరం కొంత కోలుకున్నప్పటికీ ఉదయం 9.30 గంటల సమయానికి 329 పాయింట్ల నష్టంతో 77,287 వద్ద కొనసాగింది. నిఫ్టీ కూడా 71 పాయింట్లు తగ్గి 24,139 వద్ద ట్రేడవుతోంది. బయోకాన్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎంసీఎక్స్‌ ఇండియా, నాల్కో, ఆస్ట్రాల్‌ ఇండియా షేర్లు స్వల్ప లాభాల్లో ఉండగా.. ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, అశోక్‌ లేలాండ్‌, లోధా డెవలపర్స్‌, చోళా ఇన్వెస్ట్‌మెంట్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి. బ్యాంక్‌ నిఫ్టీ 429 పాయింట్లు, నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీ 186 పాయింట్లు నష్టంతో కొనసాగుతున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్