గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Stock Markets - నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. పడిపోయిన టాటా షేర్లు .. !

12 ఆగస్టు, 2026

Stock markets in the red... Tata shares fall...!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 12:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముడిచమురు ధరలు పెరగడం, టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించడం మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. దీంతో టాటా గ్రూప్‌నకు చెందిన పలు కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 613 పాయింట్లు నష్టపోయి 77,540.94 వద్ద కొనసాగింది. నిఫ్టీ 190 పాయింట్లు క్షీణించి 24,279 వద్ద ట్రేడవుతోంది.


కుంగిన టాటా షేర్లు ....

చంద్రశేఖరన్‌ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో టాటా గ్రూప్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) షేరు 4 శాతానికి పైగా నష్టపోయి ఒక దశలో రూ.2,301.10 కనిష్ఠ స్థాయికి చేరింది. మధ్యాహ్నం 12.41 గంటల సమయంలో బీఎస్‌ఈలో రూ.2,332.35 వద్ద ట్రేడవుతోంది. టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ షేరు కూడా సుమారు 4 శాతం నష్టపోయింది. టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌, టాటా పవర్‌ షేర్లు సైతం దాదాపు 2 శాతం చొప్పున క్షీణించాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్