కుట్రలకు భయపడొద్దు.. కార్యకర్తలకు అండగా నిలబడండి ! 'స్థానికం,' సత్తా చాటాలి : మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర కి జగన్ దిశానిర్దేశం..
ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : “రానున్నది మన ప్రభుత్వం” ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో మన్యం జిల్లాలో సత్తా చాటాలని మాది డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొరకు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచించారు. బుధవారం తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్‌రెడ్డితో ఆయన నివాసంలో *మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక.రాజన్నదొర గారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాతో పాటు,సాలూరు నియోజకవర్గ తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం,స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు.స్థానిక ఎన్నికల్లో సాలూరులో వైసీపీ సత్తాచాటాలని,కూటమి ఒత్తిళ్లు, కేసులు,అరెస్టులకు భయపడకుండా కార్యకర్తలకు అండగా నిలవాలని ఆయన సూచించినట్లు రాజన్న దొర తెలిపారు.కార్యకర్తలకు అన్యాయం చేసే వారికి భవిష్యత్తులో సమాధానం చెబుతాం. జగనన్న 2.0 అంటే ఏమిటో చూపిస్తాం అని స్పష్టంగా చెప్పినట్లు పేర్కొన్నారు.
మావుడి సోదరులకు భరోసా...
వైయస్సార్సీపి అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జగన్ మోహన్ రెడ్డి మావుడి సోదరులకు భరోసా ఇచ్చినట్లు రాజన్న దొర తెలిపారు. వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి పార్వతీపురం జిల్లా సమన్వయకర్త జడ్పిటిసి సభ్యులు ఎం శ్రీనివాసరావు, మక్కువ మండల పార్టీ అధ్యక్షులు ఎం రంగు నాయుడు బుధవారం తాడేపల్లి లో రాజన్న తో పాటు జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. పార్టీకి అండగా ఉంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చి ముందుకు నడపాలని ఈ సందర్భంగా వారికి సూచించినట్లు రాజన్న దొర తెలిపారు








కామెంట్‌లు (0)