సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Markets - అమెరికా ప్రకటన - లాభాల్లో స్టాక్ మార్కెట్లు ..!

14 గంటల క్రితం

US Announcement – ​​Stock Markets Rally..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 12:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌తో చర్చలు జరుపుతామని అమెరికా ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల ధోరణి కనిపించింది. ఉదయం 9.41 గంటల సమయానికి సెన్సెక్స్‌ 519 పాయింట్లు లాభపడి 78,613 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 172 పాయింట్లు పెరిగి 24,557 వద్ద కొనసాగింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 95.13గా నమోదైంది. నిఫ్టీ సూచీలో ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టీఎంపీవీ షేర్లు లాభాల్లో కొనసాగగా.. సన్‌ ఫార్మా, మారుతీ సుజుకీ, సిప్లా, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఇరాన్‌తో సోమవారం మధ్యాహ్నం నుంచి చర్చలు ప్రారంభిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర దాదాపు 5 శాతం తగ్గి 83.5 డాలర్లకు చేరింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళనలు కొంత సడలగా, దేశీయ మార్కెట్లకు ఊరటనిచ్చింది.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్