బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Asian Games : నెరవేరిన కల .. మీరాబాయి చానుకి రజతం

53 నిమిషాల క్రితం

Mirabai Chanu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 12:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నగోయా : భారత వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను బుధవారం ఆసియా గేమ్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నారు. మహిళల 49 కేజీల విభాగంలో ఆమె సత్తాచాటి వెండి పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఒలింపిక్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, కామన్వెల్త్‌ వంటి అంతర్జాతీయ టోర్నీల్లో అనేక పతకాలు సాధించిన మీరాబాయి ఇప్పటి వరకు ఆసియా గేమ్స్‌లో పతకాన్ని సాధించలేకపోయారు. జపాన్‌ వేదికగా జరుగుతోన్న 2026 ఆసియా గేమ్స్‌లో తన కలను నిజం చేసుకున్నారు.

ఈ పోటీల్లో మీరాబాయి చాను స్నాచ్‌లో 83 కేజీలు, ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ వరుసగా 85కేజీలు, 87 కేజీలను విజయవంతంగా పూర్తి చేసి, పోటీలో మూడవ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఆమె క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 111 కేజీలు ఎత్తారు. మొత్తంగా 198 కిలోలు ఎత్తి రెండో స్థానంలో నిలిచారు. గతంలో రెండు సార్లు తృటిలో పతకం చేజారిన సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో తొలి స్థానంలో నిలిచిన ఉత్తరకొరియా వెయిట్‌లిఫ్టర్‌ రి సాంగ్‌ గమ్‌.. రికార్డు స్థాయిలో మొత్తం 215 కేజీలు (స్నాచ్‌లో 94 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 121 కిలోలు) ఎత్తి బంగారు పతకం సాధించారు.

మరోవైపు 28 ఏళ్ల తర్వాత ఆసియా గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత్‌ పతకం సాధించింది. 1998లో జరిగిన ఆసియా క్రీడల్లో కరణం మల్లీశ్వరి కాంస్యం సాధించారు. . ఇక, మీరాబాయి చాను గతంలో టోక్యో ఒలింపిక్స్‌లో రజతం, రెండు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు, కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు, ఒక రజత పతకాలను సాధించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్