మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

డ్రాయింగ్ నేర్చుకున్నా..

28 జూన్, 2026

dheksharasinaitembomma
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 06:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నా పేరు దీక్ష. నేను ఏడవ తరగతి చదువుతున్నాను. వేసవి సెలవుల్లో నేను చిన్న తిరుపతి, కాకినాడ వెళ్లాను. కాకినాడలో బీచ్ కి వెళ్లాను. పడవ కూడా ఎక్కాను. నాకు పడవ ఎక్కటం చాలా నచ్చింది. వేసవి సెలవుల్లో నేను, మా తమ్ముడు చాలా ఆటలు ఆడుకున్నాము. నేను అమ్మకి సాయం చేశాను. మా తమ్ముడు స్విమ్మింగ్ నేర్చుకున్నాడు. నేనైతే డ్రాయింగ్ నేర్చుకున్నాను. వేసవి సెలవులు చాలా సరదాగా గడిచిపోయాయి. అప్పుడప్పుడు గ్రంథాలయానికి వెళ్లి, కొన్ని పుస్తకాలు చదివాను. పార్కుకు కూడా వెళ్లాను. ఇంటి దగ్గర మా స్నేహితులతో ఆడుకున్నాను. ఇక స్కూలు తెరిచారు కాబట్టి, స్నేహితులతో చదువు బాట పడతాము.


వి. దీక్ష, 7వ తరగతి,

అరవింద మోడల్ స్కూల్, మంగళగిరి,

గుంటూరు జిల్లా.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్