మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజియోగ్రఫీ పోటీల్లో 12 పతాకాలు సాధించా...

26 జులై, 2026

jai vemuri
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 07:29 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రియమైన స్నేహితులారా!!

మాది కృష్ణాజిల్లా ఘంటసాల మండలం ఘంటసాలగ్రామం. నా తల్లిదండ్రులు డాక్టర్ ప్రవీణ్ వేమూరి, డాక్టర్ దీప్తి వేమూరి. ఇద్దరూ అమెరికాలో వైద్యులుగా సేవలందిస్తున్నారు.నేను కూడా అమెరికాలోనే పుట్టాను. అక్కడే పెరుగుతున్నాను. ఇప్పుడు నాకు ఎనిమిదేళ్లు. చదువుతో పాటు వివిధ విద్యా పోటీల్లో విశేష ప్రతిభ కనబరుస్తూ వస్తున్నాను. ఇటీవల థాయిలాండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ భూగోళశాస్త్ర (Geography Bee)పోటీల్లో పాల్గొని మొత్తం 12 పతకాలు సాధించాను. వాటిలో 2 బంగారు, 3 వెండి, 7 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రతిష్టాత్మమైన ఇంటర్నేషనల్ జియోగ్రఫీ బీ (International Geography Bee) పోటీలో ప్రపంచ స్థాయిలో ద్వితీయ స్థానం సాధించి అరుదైన ఘనతను కూడా సాధించాను. నేను సాధించిన విజయంపై ఘంటసాల గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి భారతదేశానికి, తెలుగు సమాజానికి మరింత గౌరవం తీసుకురావాలని వారంతా ఆకాంక్షించారు. అందరికీ ధన్యవాదాలు.

జై వేమూరి,

యుఎస్‌ఎ


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్