హాయ్ ఫ్రెండ్స్
నాకు బొమ్మలు గీయటం, తయారుచేయటం అన్నా ఎంతో ఇష్టం. అందుకే అనునిత్యం ప్రాక్టీస్ చేస్తుంటా. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటా. మా జీవ శాస్త్ర ఉపాధ్యాయుడు పిల్లి గోవిందరాజులు గారు కాగితాలతో బొమ్మలను తయారుచేయటంలో ప్రోత్సహిస్తున్నారు. ప్రతి శనివారం కొంత సమయంలో ఇలాంటి యాక్టివిటీస్‌కు సమయం ఉంటుండటంతో మేము ప్రాక్టీసు చేస్తున్నాం. మాస్టారు కలర్ పేపర్ తో కుందేలు ఫింగర్ పప్పెట్లను మా అందరి చేత ప్రాక్టీస్ చేయిస్తున్నారు. వీటిని ఉపయోగించి మేము కథలను కూడా చెప్పడం జరిగింది.

-కొంజెర్ల అక్షర,
6వ తరగతి, చెందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ,
గొల్లప్రోలు మండలం, కాకినాడ జిల్లా.







కామెంట్‌లు (0)