గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాఠాలు చెప్పాను..

11 గంటల క్రితం

చిన్నారి.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 03:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హాయ్‌ ఫ్రెండ్స్‌,

ఉపాధ్యాయుల దినోత్సవం రోజున నాకు పాఠాలు చెప్పే అవకాశం వచ్చింది. మేమందరం ప్రీ ప్రైమరీ నుండి 3వ తరగతి వరకు ఉపాధ్యాయుల బాధ్యతలను స్వీకరించాం. చిన్న పిల్లల గొడవలు, ఉపాధ్యాయుల బాధ్యత కలగలిసి ఒకరోజు మొత్తం పాఠాలు బోధించడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఉపాధ్యాయుల దినోత్సవం రోజు నాతో పాటు మా స్నేహితులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మేమంతా రోజంతా పాఠాలు బోధించడమే కాకుండా, ఎంతో ఆనందంగా గడిపాం. ప్రతిరోజు ఉపాధ్యాయులు ఎంత కష్టపడతారో, పాఠాలు చెప్పడం వెనుక ఎంత శ్రమ ఉందో ఆ రోజు నాకు స్పష్టంగా అర్థమైంది. ఆ అనుభవం చాలా చక్కగా అనిపించింది. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనంత సంతోషంగా ఉంది.

0_resized.jpg

ఆర్‌. సంజన, 10వ తరగతి,

అరవింద హై స్కూలు, కుంచనపల్లి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్