నవ్వుల పువ్వుల
పరిమళాలే బాల్యం
చిరుప్రాయపు చిన్నారులు
నిష్కల్మష జలధారలు
పిల్లల ముద్దు పలుకులే
సప్త స్వరాలాపనలు
ఆటపాటల బాల్యం
కలుషితమౌతోంది
వేయిపడగల విషనాగు
కాలకూటాన్ని నింపుతోంది
సెల్ ఫోన్ భూతంగా
మాదక ద్రవ్యాల మత్తుగా
కలికాలం, కన్నవాళ్లే
యమ భటులౌతున్నారు
గురువులు సరికొత్త
సిలబస్ కు శ్రీకారం చుట్టారు
చిన్నమెదడులో చెత్తను నింపుతున్నారు
పుస్తకం పట్టాల్సిన చేతులు
రాత్రి పగలు తేడాలేని
నీలి తెరలలో తేలుతున్నాయి
తక్షణమే శుభ్రపడే
శానిటైజర్ లు కావాలి
ఎండిన విత్తనంలోని అంకురంలా
ప్రతి మనిషి బాల్యాన్ని దాచుకోవాలి
అనురాగపు తోటను పెంచాలి
రేపటి ప్రపంచానికి
ఆరోగ్యమైన బాల్యాన్ని
అందమైన భవితను అందించాలి
బాలలంటే మన సంస్కృతికి వారసులు
- డా.నీరజ అమరవాది,
98491 60055.








కామెంట్‌లు (0)