శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అదరగొట్టిన యువ క్రికెటర్లు

1 గంట క్రితం

saas
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 11:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఆర్యావీర్, ల‌క్ష్య రాయిచందానీ అర్ధ సెంచ‌రీలు

- నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు

మ‌స్క‌ట్‌: ఆసియాక‌ప్‌ (అండ‌ర్‌-19)లో ఇండి యా బోణీ కొట్టింది. నేపాల్‌తో శుక్రవారం జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ జ‌ట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజ‌యం సాధించింది. నేపాల్‌ నిర్దేశించిన 129 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భారత్‌ కేవ‌లం 19.1 ఓవ‌ర్ల‌లో వికెట్లేమీ నష్టపోకుండా ఛేదించింది. ఓపెన‌ర్లు ఆర్య‌వీర్ సెహ్వాగ్ చెల‌రేగి ఆడాడు. వీరేంద్ర సెహ్వాగ్ త‌న‌యుడైన ఆర్య‌వీర్‌.. కేవ‌లం 52 బంతుల్లో 70 పరుగులు చేశాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో ఏడు బౌండ‌రీలు, నాలుగు సిక్స‌ర్లు ఉన్నాయి. ఇక మ‌రో ఓపెన‌ర్ ల‌క్ష్య రాయిచెందాని 63 బంతుల్లో 53 పరుగులు చేసి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు. ఈ గెలుపుతో భారత్‌ పాయింట్ల ప‌ట్టిక‌లో ఖాతా తెరిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 42.3 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 128 పరుగులకు ఆలౌటైంది. నేపాల్ జ‌ట్టులో ద‌ర్శ్ సోనార్ అత్య‌ధికంగా 43 పరుగులు చేశాడు. భార‌త బౌల‌ర్ల‌లో అర్జుత్ రాజ్‌పుత్‌, ఇషాన్ సూద్‌లు చెరి మూడేసి వికెట్లు చొప్పున పడగొట్టారు. ఆదివారం భారత్‌, పాకిస్తాన్‌ జట్ల మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్‌ జరగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్