యూత్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ ఫైనల్లో ఓటమి
డాకర్ (సెనెగల్): యూత్ ఒలింపిక్స్‌లో భారత షట్లర్ తన్వి పత్రి రజత పతకం సాధించింది. మహిళల బ్యాడ్మింటన్‌లో సంచలన విజయాలతో తుదిపోరుకు చేరి రికార్డు సృష్టించిన ఈ ఒడిశా అమ్మాయి.. చివరకు రజతంతో సరిపెట్టుకుంది. గురువారం హోరాహోరీగా సాగిన సింగిల్స్ ఫైనల్లో తన్వి 21-15, 13-21, 24-26తో చైనా షట్లర్ జాంగ్ యి గ్జిన్ చేతిలో పరాజయం పాలైంది. దీంతో యూత్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో రజతం నెగ్గిన తొలి భారత మహిళా షట్లర్‌గా 15 ఏళ్ల తన్వి ఘనత వహించింది. గతంలో హెచ్‌ఎస్ ప్రణయ్ (2010), లక్ష్యసేన్ (2018) రజత పతకాలు సాధించారు.








కామెంట్‌లు (0)