న్యూఢిల్లీ: ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్(ఎఐటిఎ) పాలక మండలి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా భారత దిగ్గజ ప్లేయర్లు సానియా మీర్జా, మహేష్ భూపతి ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో భూపతికి అత్యధికంగా 23 ఓట్లు రాగా.. సానియా మీర్జాకు 18 ఓట్లు దక్కాయి. జానకి కృష్ణమూర్తికి 13 ఓట్లు, విశాల్ ఉప్పల్‌కు ఏడు ఓట్లు లభించాయి. దీనికి ముందు జరిగిన జనరల్ బాడీ పదవికి భూపతి, మీర్జాలకు 19, 18 చొప్పున ఓట్లు రావడంతో ఎస్ఓఎమ్ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. వీరితో పాటు అశుతోష్ సింగ్ (17 ఓట్లు), షాలిని ఠాకూర్ చావ్లా (16 ఓట్లు) కూడా ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. జనరల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసిన ఇతర అభ్యర్థులు జానకి కృష్ణమూర్తి (15), విశాల్ ఉప్పల్ (9), గౌరవ్ నాటేకర్ (8) మరియు అంకిత బాంబ్రి (7) చొప్పున ఓట్లు వచ్చాయి.
టెన్నిస్ పాలకమండలికి సానియా, భూపతి ఎంపిక
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 06, 2026, 10:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)