గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పచ్చని ఋతువు

17 గంటల క్రితం

పచ్చని ఋతువు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 03:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

పచ్చని ఋతువు

శరదృతువు శీతాకాలంతో

పరిమళాల స్నేహం చేసింది

చలిమంటల దుప్పటిలో

చిన్నారులు దోబూచులు

పుల్లటి నిమ్మ, చింత, ఉసిరి

పచ్చని చెట్టుగ మారాయి

కిచ కిచ మంటూ పిట్టలు

అల్లరి పిల్లలతో పోటీలు

పారిజాత కొమ్మలు

సుగంధాల వింజామరలుగా

ఎరుపు మందారం, గన్నేరు

దీపకాంతులతో మెరిసిపోతున్నాయి

కొబ్బరి, అరటి దొప్పల

కార్తీక పడవల ప్రవాహాలు

రంగు పూల కాంతులతో

ఇలలో ఇంద్రధనస్సుగా

వెలగ, రేగి పండ్ల ఘుమ ఘుమలు

నాసికను ఊయలలూపాయి

చెరుకుగడల కోలాటాటలతో

పిల్లలు పదం కలిపారు

చెట్టు మీది ఉడుతమ్మ

లేత జామ కోసం పరుగు

పిల్లల నవ్వులు చుక్కలవ్వగా

పగలే నిండు పున్నమి భానుడు.

- డా. నీరజ అమరవాది,

98491 60055.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్