బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅచ్చులు – పద్యాల పాట

23 గంటల క్రితం

kavitha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 03:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

‘అ ఆ’ అని రాసేద్దాము

అమ్మకు ఆనందము ఇచ్చేద్దాము


‘ఇ ఈ’ అని పలికేద్దాము

ఇంటికి ఈతపండ్లు కొనేద్దాము


‘ఉ ఊ’ అనేద్దాము

ఉడతను ఊయలలో ఊపేద్దాము


‘ఋ ౠ’ పలికేద్దాము

ఋషితో ౠ అని చెప్పేద్దాము


‘ఎ ఏ ఐ’ పలికేద్దాము

ఎందుకు ఏమిటి ఐదు అనేద్దాము


‘ఒ ఓ ఔ’ పలికేద్దాము

ఒక ఓటు వేసి ఔటు పేలుద్దాము


‘అం అః’ అనేద్దాము

అందముగా అంతఃపురము వెళ్లేద్దాము

- జక్కుల వరప్రసాదరావు,

చెత్నిహళ్లి, మంత్రాలయం,

కర్నూలు జిల్లా.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్