అహో! అహో! పావురమా!
అందాలా పావురమా!!
మా పాపా నిను చూసీ
మైమరచీ తెగ మురిసీ!
పదిలంగా తన చేతిలొ
ఒదిగి వుండు తగు రీతిలొ!!
తెల్లనైన నీ మేనూ
మల్లెలతో సమమేనూ!
నిమిరిన చో నీ మేనూ
అమితానందమ్మేనూ!!
గుడీ గోపురా లెందుకు?
గూడున్నది వుండేందుకు!
గూటిలోనె కడు వెచ్చగ
కునుకు బాగ తీయొచ్చుగ!!
‘బాలబంధు` అలపర్తి వెంకట సుబ్బారావు
(కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత)
9440805001.








కామెంట్‌లు (0)