పిల్లలు పిల్లలు చల్లని నవ్వులు
మల్లెల మెరుపులు పిల్లంగోవులు
యెల్లలు కానని అల్లరి పిడుగులు
కల్లలు యెరుగని ధర్మ నియోగులు
నింగిన చుక్కలు నిశిన చమక్కులు
నిద్దుర దృక్కులు యెంతో కిక్కులు
గారాబానికి హక్కుదారులు
అలిగినరంటే అన్నమ్ముట్టరు
కిష్కిందకు సరి సిరి వారసులు
లంక దహనపు నవ వానరులు
కలహ దంపతుల కలుపు వారధులు
అమ్మా నాన్నల సిరి నీరధులు
అంతే లేని ప్రశ్నల బుక్కులు
యెంతకు ఒడువని బుడిబుడి ఋక్కులు
తప్పూ ఒప్పూ యెరుగని మనసులు
నిప్పునైన చేపట్టే సరసులుమ
పెరిగిన కొద్దీ అన్నీ మరచీ
సంపద మరిగీ నిప్పున కరిగీ
వృద్దాశ్రమమున తల్లిదండ్రులు
పిల్లలు హాస్టల్ క్వారంటైనులో
మమతలు సమతలు వట్టి మాటలే
డాలర్ ఫౌండుల కొరకు బతుకుడే
- జమ్మి, హన్మకొండ,
94913 19904.







కామెంట్‌లు (0)